ETV Bharat / jagte-raho

చెట్టు కొమ్మలు కొట్టబోయి నాలాలో పడిన యువకుడు - a man fall from tree

రంగారెడ్డి జిల్లా​ మియాపూర్​లో ఓ యువకుడు ప్రమాదవశాత్తు నాలాలో పడ్డాడు. తన మేకల కోసం చెట్టు కొమ్మలు కొడుతుండగా... ప్రమాదవశాత్తు జారి నాలాలో పడిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది బాధితున్ని వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు.

man fall in nala from tree at kukatpally

author img

By

Published : Oct 21, 2020, 9:44 PM IST

చెట్టు కొమ్మలు కొడుతూ... అదే చెట్టుపై నుంచి పడి ఓ వ్యక్తి తీవ్రగాయాలకు గురైన ఘటన హైదరాబాద్​ కేపీహెచ్​బీ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మియాపూర్​లో నివసించే గణేశ్​ మేకలు మేపుతూ జీవిస్తున్నాడు. కేపీహెచ్​బీ కాలనీలోని రోడ్ నంబర్ 4 లో ఓ చెట్టు కొమ్మలను కొడుతున్న క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు.

కొమ్మలు కొడుతున్న చెట్టుపై నుంచి పక్కనే ఉన్న నాలాలో గణేశ్​ పడిపోయాడు. ఈ ఘటనలో బాధితుని తలకు తీవ్రగాయాలయ్యాయి. గాయాలతో నాలాలో పడి ఉన్న గణేశ్​ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, అంబులెన్స్​కు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలా నుంచి బాధితుడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా: మంత్రి హరీశ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.