ETV Bharat / jagte-raho

చెరువులో పడి వ్యక్తి మృతి.. కేసు నమోదు

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Man dies after falling into pond .. Case registered
చెరువులో పడి వ్యక్తి మృతి.. కేసు నమోదు
author img

By

Published : Sep 11, 2020, 9:52 AM IST

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం దర్యాపూర్​లో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని చెరువులో పడి పుట్టకోల్ల రవీందర్ అనే వ్యక్తి మృతి చెందాడు.

గురువారం మధ్యాహ్నం చెరువులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మృతుడు రవీందర్​ అడవి శ్రీరాంపూర్​ గ్రామానికి చెందిన వ్యక్తిగా గ్రామస్థులు గుర్తించారు. చేపలు పట్టేందుకు చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు.

ఇదీచూడండి.. ఐదో తరగతి వరకే చదివాడు... ప్రముఖ ఆస్పత్రుల్లో పెద్ద డాక్టరయ్యాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.