మంచిర్యాల జిల్లా మందమర్రిలో కరోనాతో దాసరి రమేష్ (40) అనే ఫొటోగ్రాఫర్ మృతి చెందాడు. ఈ ఘటన మందమర్రిలో విషాదం నింపింది. రమేష్‌కు 25 రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో 14 రోజుల పాటు ఇంట్లో ఉండి చికిత్స తీసుకున్నాడు. కోలుకున్న తరువాత వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ క్రమంలో గత నెల 23న తీవ్ర జ్వరం, ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. వైద్య పరీక్షలు చేయించుకోగా... మరోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మందమరి శివారులో కోవిడ్ నిబంధన ప్రకారం అంత్యక్రియలు జరిపించారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.