జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తుంగభద్ర నదిలో యువకుడు మృతి చెందాడు. నందికొట్కూర్కు చెందిన జాకీర్ హుస్సేన్ స్నేహితులతో కలిసి వచ్చాడు. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతున్న సమయంలో అనుకోకుండా నేలంపాడు గ్రామ సమీపంలోని తుంగభద్ర నదిలో జారిపడినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జాకీర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో 20 లక్షల హవాలా డబ్బు స్వాధీనం