సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్లు గ్రామానికి చెందిన దేవులపల్లి సైదులు హైదరాబాద్లో కూలీపనులు చేసుకొంటూ జీవనం గడుపుతున్నాడు. ఆస్తుల వివరాల నమోదులో భాగంగా ఇల్లు రిజిస్ట్రేషన్, దసరా పండుగ కొరకు అక్టోబర్ 23న ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయల్దేరాడు.
మార్గమధ్యంలో తుంగతుర్తి మండలం వెలుగుపల్లి వద్ద 365 జాతీయ రహదారి మీద వడ్ల కుప్పను గమనించని సైదులు వేగంగా వెళ్లేసరికి.. వాహనం అదుపుతప్పి.. కింద పడ్డాడు. తలకు బలమైన గాయమైంది. వెంటనే స్పందించిన స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని భార్య ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.
ఇదీ చదవండిః దసరా వేళ బస్సులు లేక ప్రయాణికులు ఇక్కట్లు