అప్పటివరకు అందరితో కలివిడిగా తిరిగాడు. ఇంటికొచ్చాక.. గదులను శుభ్రం చేస్తుండగా.. అడ్డుగా ఉన్న ఇనుప కూలర్‌ను జరపడానికి ప్రయత్నించారు. దానికి విద్యుత్ సరఫరా జరిగి ఆ వ్యక్తి మరణించిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం రహపల్లిలో జరిగింది. గురవయ్యను గమనించిన కుటుంబసభ్యులు ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించే మార్గమధ్యంలోనే మరణించాడు.
గురవయ్యకు అమ్మానాన్నలతో పాటు భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే గురవయ్య అన్నయ్య మరణించగా.. తల్లిదండ్రుల బాధ్యత తానే తీసుకుని వారిని పోషిస్తున్నాడు. అప్పటికే చేతికందిన పెద్దకొడుకును కోల్పోయి బాధలో ఉన్న ఆ దంపతులకు.. గురవయ్య మృతి మరింత ఆవేదనను మిగిల్చింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యుదాఘాతంతో మరణించిన గురవయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.
ఇదీ చూడండి: హైడ్రాక్సీ క్లోరోక్విన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది: ట్రంప్