మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో విషాదం చోటుచేసుకొంది. గౌరీశంకర్ కాలనీలో పురుగుల మందు తాగి శేఖర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావడం లేదని గుర్తించిన స్థానికులు.. అక్కడకు వెళ్లి పరిశీలించారు. విగత జీవిగా శేఖర్ కనిపించాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
శేఖర్ భార్య పద్మ.. పిల్లలతో కలిసి ఈనెల 8న ఆమె చిన్నమ్మ ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఒక్కడే ఉన్న శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా వల్ల సెలూన్ సరిగ్గా నడవకపోవడం వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు.. మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీచూడండి: గడ్డి చుట్టే యంత్రంలో చేయి పడి యువకుడి మృతి