మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాగిల్లాపూర్‌కు చెందిన మాలోత్ విఠల్ పెయింటర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన విఠల్.. స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
స్థానికులు దుండిగల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.