ఆన్లైన్ వ్యాపారం చేద్దామంటూ ఓ వ్యాపారిని మోసగించిన వ్యక్తిని హైదరాబాద్ కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. హైదర్‌నగర్‌లో నివసించే వెంకట స్వరూప్ అనే వ్యక్తి ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే వ్యాపారం చేస్తున్నాడు. అతనికి మార్లిన్ జెవోయిర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పంజాబ్‌లోని ట్రాన్స్ఫ్లెక్స్ పేటెక్ సొల్యూషన్స్ అనే ఆన్లైన్ వ్యాపారం కంపెనీలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని మార్లిన్ నమ్మబలికాడు.
మార్లిన్ మాటలు నమ్మిన స్వరూప్.. ఆ కంపెనీ సీఈవో అశోక్ టాండన్‌కు రూ. 19,85,201 డబ్బును ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత కేవైసీ సమస్య వచ్చిందంటూ మార్లిన్ ముఖం చాటేశాడు. డబ్బులు తిరిగి పంపించాలని మార్లిన్‌ను అడగగా.. రూ. 8 లక్షల చెక్కును వాట్సాప్ ద్వారా పంపించి.. మిగతా డబ్బులు తిరిగి పంపించేస్తామని నిందితులు నమ్మించారు. తాను మోసపోయానని గ్రహించిన బాదితుడు స్వరూప్ పోలీసులను ఆశ్రయించగా వారు కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పంజాబ్‌లో ఉన్నారని.. స్పెషల్ టీం ద్వారా వారిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.