హైదరాబాద్ ట్యాంక్బండ్లోకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఎన్టీఆర్ మార్గ్ ముందు శివ అనే వ్యక్తి ఒక్కసారిగా ట్యాంకు బండ్లోకి దూకాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న సైఫాబాద్ పోలీసులు... వెంటనే అతన్ని రక్షించారు.
చికిత్స నిమిత్తం తక్షణమే 108 సాయంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో... ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించాడో వివరాలు సేకరిస్తున్నారు.