మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ద్విచక్ర వాహనాలు చోరి చేస్తున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో ఇంటి ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను అదును చూసి చోరి చేసేవాడు. గత నెల 28న అకీత్ బైక్ పోయిందని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పట్టణానికి చెందిన జుబేర్ దొంగిలించిన బైక్‌పై తిరుగుతుండగా పోలీసులకు అనుమానం వచ్చి విచారించగా... రెండు బైక్‌లు దొంగిలించినట్లు తేలింది. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన క్రైమ్ కానిస్టేబుల్ పోచయ్యను సీఐ నాగయ్య అభినందించారు.
ఇదీ చూడండి: చైనాలో కరోనా వ్యాప్తి ఆగస్టులోనే.. ఇవే సాక్ష్యాలు!