ETV Bharat / jagte-raho

అడ్డుకోబోయిన ఏఎస్సైపై దాడి...యువకుడు అరెస్ట్​ - AP news

ఏపీలోని పశ్చిమగోదావరిలో విధి నిర్వహణలో ఉన్న ఏఎస్ఐ పార్థసారథిపై.. కత్తితో దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పొలం విషయంలో గొడవ పడుతున్న ఇద్దరు యువకులకు సర్ది చెప్పేందుకు వెళ్లిన పోలీసులపై ఓ యవకుడు దాడికి దిగాడు. ఈ దాడిలో ఏఎస్సైకి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

man-arrested-for-man-handling-on-police-at-west-godavari in AP
అడ్డుకోబోయిన ఏఎస్సైపై దాడి...యువకుడు అరెస్ట్​
author img

By

Published : Dec 15, 2020, 10:32 PM IST

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో.. విధి నిర్వహణలో ఉన్న ఏఎస్ఐ పార్థసారథిపై కత్తితో దాడి చేసిన యువకుడు అరుణ్ కుమార్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరవాసరం-మత్స్యపురి మార్గంలో అరుణ్ కుమార్, గోపి కిషోర్ అనే ఇద్దరి మధ్య పొలం విషయంలో గొడవ జరుగుతుందన్న సమాచారంతో.. ఏఎస్ఐ పార్థసారధి, కానిస్టేబుల్ మూర్తి అక్కడికి వెళ్లారు.

ఇద్దరి మధ్య వివాదం పెరగడంతో అరుణ్.. గోపిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ సమయంలో అడ్డుకున్న ఏఎస్సై పార్థసారథిపై అరుణ్ కుమార్ విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచాడు. చికిత్సా నిమిత్తం ఏఎస్సై పార్థసారథిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన అరుణ్ కుమార్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసాపురం డీఎస్పీ వీరాంజనేయరెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:రేపు దిల్లీ వెళ్లనున్న ఎంపీ రేవంత్​ రెడ్డి.. పీసీసీ కోసమేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.