యాదాద్రి భువనగిరి మండలం బొల్లేపల్లిలో కల్తీ పాలు తయారు చేస్తోన్న కుసుకుంట్ల జంగారెడ్డి అనే వ్యక్తిని భువనగిరి ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 300 లీటర్ల కల్తీ పాలు, 8 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 13 ఖాళీ పాల పౌడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు నిందితుడిని రూరల్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీచూడండి: లాడ్జిలో గుట్టుగా వ్యభిచారం... ఐదుగురు వ్యక్తులు అరెస్ట్