అమ్మాయిలే అతని టార్గెట్.. ఇన్‌స్టాగ్రామ్‌లో మొదటగా యువతులతో పరిచయం చేసుకుంటాడు. కొన్ని రోజులు బాగానే స్నేహం చేస్తాడు. ఆ తర్వాతే తెలుస్తుంది అతడి వక్రబుద్ధి. అశ్లీల చిత్రాలు, వీడియోలు పంపి వేధిస్తుంటాడు. ఓ మహిళ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం రామన్నగూడెంకు చెందిన సంతోష్ కుమార్. ఇతను మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: ఇన్‌స్టాలో అమ్మాయిల పేరుతో ఖాతా.. ఆపై బెదిరింపులు