ETV Bharat / jagte-raho

వ్యభిచార గృహంపై దాడి.. ఇద్దరు యువతులకు విముక్తి - వ్యభిచార గృహంపై దాడి

హైదరాబాద్​ పరిసర ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం దందా కొనసాగుతోంది. సామజిక మాధ్యమాల్లో విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ అంతర్ రాష్ట్ర ముఠా మల్కాజ్​గిరి పోలీసులకు పట్టుబడింది. ఆ మేరకు ఇద్దరు యువతులకు.. వ్యభిచార గృహం నుంచి విముక్తి లభించింది.

malkajgiri police Attack on a brothel house Two women freed
వ్యభిచార గృహంపై దాడి.. ఇద్దరు యువతులకు విముక్తి
author img

By

Published : Jan 6, 2021, 1:27 PM IST

మేడ్చల్​ మల్కాజ్​గిరి ​జవహార్​నగర్ పోలీస్​స్టేషన్​ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తోన్న ఓ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులతో పాటు ఓ విటుడు, పలువురు బాధిత మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

ఈ విధంగా..

కలకత్తాకు చెందిన నిర్వాహకురాలు గత కొన్ని నెల్లుగా దమ్మాయిగూడెంలో ఇల్లు అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహించింది. కలకత్తా నుంచి యువతులను తీసుకొచ్చి వాళ్ల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. అలా ఆన్​లైన్ ఫ్లాట్​ఫామ్​లలో విటులను ఆకర్షించింది. భేరసారాలు మాట్లాడుకొంటూ విటులను రప్పించి పోలీసులు కళ్లుగప్పి వ్యభిచారం కొనసాగించింది.

నిందితురాలికి హైదరాబాద్​లోని పలు వ్యభిచార నిర్వాహకులతోనూ పరిచయాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పలు ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి.. నగరంలోని నిర్వాహకులకు అప్పజెప్పినట్లు తమ దర్యాప్తులో తేలిందని వారు వెల్లడించారు.

ఈ ఘటనపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పందించారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం.. ముగ్గురి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.