ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్‌కు పోలీసులు జరిమానా విధించారు. హైదరాబాద్ మాదాపూర్‌లో నూతనంగా నిర్మించిన తీగల వంతెనపై కారు నంబర్ ప్లేట్ సరిగ్గా లేకుండా, చరవాణిలో మాట్లాడుతూ కారును పార్కింగ్ చేసినందుకు మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు రూ. 1300 చలానా విధించారు. ప్రజా ప్రతినిధి కుమారుడై ఉండి నిబంధనలు పాటించక పోవడం వల్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
ఇదీ చదవండి: ఎమ్మెల్యే మందలింపు.. మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం