తమ ప్రేమను పెద్దలు అంగీకరించకుండా పెళ్లికి నిరాకరించారని మనస్తాపానికి గురై ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వేముల గ్రామంలో చోటుచేసుకుంది. వేముల గ్రామానికి చెందిన శ్రీకాంత్(22), అఖిల (20) ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడం వల్ల మనస్తాపానికి గురై గ్రామశివారులోని మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
చీకటి పడ్డాక స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడం పట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి: లారీని ఢీకొన్న కారు...ఇద్దరు మృతి