ETV Bharat / jagte-raho

కౌన్​ బనేగా కరోడ్​పతి అన్నారు... రూ.నాలుగు లక్షలు స్వాహా చేశారు - హైదరాబాద్‌ తాజా వార్తలు

కౌన్ బనేగా కారోడ్‌పతి (కేబీసీ) లాటరీ తగిలిందంటూ నగరానికి చెందిన ఓ మహిళకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఆమె వద్ద నుంచి రూ.4 లక్షల వరకు తమ అకౌంట్‌లోకి డిపాజిట్ చేయించుకున్నారు. ఎంతకూ లాటరీ ప్రైజ్ రాకపోయేసరికి... బాధిత మహిళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

lottery  Cheating Case in Hyderabad
లాటరీ పేరుతో రూ.నాలుగు లక్షలు స్వాహా
author img

By

Published : Mar 20, 2020, 9:05 AM IST

కేబీసీ లాటరీలో రూ.25 లక్షల ప్రైజ్ మనీ గెలుపొందారని... హైదరాబాద్‌ దూద్ బౌలి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు కొన్ని రోజుల క్రితం ఫోన్ కాల్స్ వచ్చాయి. నగదును పొందేందుకు ఆధార్ కార్డు సమర్పించాలన్నారు. అనంతరం ప్రాసెసింగ్ ఫీజు, ఆదాయపు పన్ను, జీఎస్టీ ఛార్జీల పేరుతో విడతల వారీగా కొంత డబ్బును వారి అకౌంట్‌లోకి డిపాజిట్ చేయించుకున్నారు.

ప్రైజ్ మనీ పెరిగిందని..

అంతటితో ఆగకుండా మరోసారి ఆ మహిళకు ఫోన్‌ చేశారు. మీ ప్రైజ్ మనీ పెరిగిందని, రూ.కోటి విలువ చేసే కారు గెలుపొందారంటూ ఆశపెట్టారు. ముందు లానే విడతల వారీగా అడిగిన డబ్బులను వివిధ అకౌంట్‌లలో డిపాజిట్ చేసింది. ఇలా సుమారు రూ.4లక్షలు వారికి పంపించింది.

కేబీసీ ఒక గేమ్ షో..

రోజులు గడుస్తున్నా ప్రైజ్ మనీ రాకపోవడం, పదే పదే ఆగంతుకులు డబ్బులు కోసం ఫోన్‌ చేయడం గమనించి మోసపోయానని తెలుసుకుంది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేబీసీ అనేది ఒక గేమ్ షో అని, దాని పేరుతో ఎటువంటి లాటరీలు లేవని పోలీసులు తెలిపారు

ఇవీ చూడండి: కరోనా కట్టడికి స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.