ఇంటి ముందు నిల్చొన్న మహిళను లారీ ఢీకొట్టింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో చోటుచేసుకుంది.
'తిరుమలగిరి పురపాలక కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఇంటి ముందు మహిళ నిలబడింది. బనగామ నుంచి సూర్యాపేటకు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది.' అని మృతురాలి ఆండాలు బంధువులు తెలిపారు. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మరణించిందన్నారు. మద్యం మత్తులో లారీ నడిపిన డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త వెంకన్న ఫిర్యాదుతో పోలీసులు కేసునమోదుచేశారు.
ఇవీచూడండి: భార్య మరణంతో మనోవేదనకు గురై ఆత్మహత్య