రంగారెడ్డి జిల్లా ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. హిమాయత్ సాగర్ సమీపంలో గచ్చిబౌలి వెళ్తున్న లారీ డ్రైవర్... శంషాబాద్ వెళ్తున్న లారీ డ్రైవర్ వద్ద డబ్బులు తీసుకున్నాడు.
తిరిగి తన లారీ వద్దకు వచ్చేందుకు రోడ్డు దాటుతుండగా... గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... డ్రైవర్ మృతికి కారణమైన గుర్తు తెలియని వాహనం కోసం గాలిస్తున్నారు.