నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ డౌన్ పార్కు వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పత్తి లోడుతో వెళుతోన్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్లకు గాయాలయ్యాయి.
పోలీసులు క్షతగాత్రులను కమలా నెహ్రు ఆసుపత్రికి తరలించారు. లారీ విజయవాడకు వెళ్తుండగా సాగర్ లాంచీ స్టేషన్ మూల మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కుంటలో పడిపోయినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి.. గాలిపటం ఎగురవేస్తుండగా కరెంట్ షాక్... బాలుడి మృతి