ETV Bharat / jagte-raho

"వేధింపులే లక్ష్యం... లోన్​ వసూలుకు మార్గం"

రుణాల వసూళ్లకు లోన్‌ యాప్‌ల అధినేతలు ఏర్పాటు చేసుకున్న కాల్‌సెంటర్ల నిర్వాహకులు, అప్పులు తీసుకున్న వారి పట్ల కాల్‌నాగుల్లా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై తదితర మెట్రో నగరాల్లో ఈ కాల్‌సెంటర్లు విస్తరించినట్లు తెలుసుకున్నారు.

వేధింపులే లక్ష్యం... లోన్​ వసూలుకు మార్గం

author img

By

Published : Jan 6, 2021, 12:43 PM IST

రుణాల వసూలుకు కాల్​ సెంటర్ల నిర్వాహకులు అప్పులు తీసుకున్నవారికి చుక్కలు చూపిస్తున్నారు. వసూళ్ల కోసం ప్రత్యేక శిక్షణా విభాగం ఏర్పాటు చేసి ఎలా పీక్కుతినాలో తర్ఫీదునిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రుణాల వసూళ్ల కోసం ప్రాంతీయ భాషలు అనర్గళంగా మాట్లాడే వారికి టెలీకాలర్ల కొలువులు ఇచ్చినట్లు పరిశోధనలో తేలింది. చైనా కంపెనీలు నిర్వహిస్తున్న ముగ్గురు చైనీయులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేయగా.. మరో ఇద్దరు చైనీయులపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. స్వల్పకాలిక రుణాల కోసం చైనీయులు యాభై వరకు యాప్‌లను ప్రవేశపెట్టారు. రుణ గ్రహీతలను ఎలా బెదిరించాలి? ఎలా వేధించాలి? అన్న అంశాలపై కాల్‌ సెంటర్ల నిర్వాహకులు టెలీకాలర్లకు శిక్షణ ఇస్తున్నారు. చైనా కంపెనీలు బ్యాంకింగేతర సంస్థను స్థాపించాయా? లేదా? అన్న అంశాన్ని ధ్రువీకరించాలంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ అధికారులు రిజర్వు బ్యాంక్‌కు లేఖ రాశారు.

పబ్బుల్లో చిందులు.. దోస్తులతో విందులు

ఉదయం నుంచి సాయంత్రం వరకు యాప్‌ ద్వారా రుణాల వసూళ్లు.. నగదు బదిలీలు.. తన బాస్‌ యాన్‌యాన్‌కు ల్యాప్‌టాప్‌ ద్వారా సమాచారం చేరవేత. కట్‌ చేస్తే.. రాత్రి ఎనిమిదింటికి గుడ్‌గావ్‌లోని పబ్బుల్లో చిందులు.. పదకొండింటి నుంచి స్నేహితులతో విందులు.. రుణాల యాప్‌లు, కాల్‌సెంటర్ల కీలక సూత్రధారి ల్యాంబో దినచర్య ఇది. మాండరిన్‌ తప్ప తనకు ఏ భాష రాదంటూ సైబర్‌ క్రైం పోలీసులకు చెప్పడంతో ల్యాంబో వ్యక్తిగత వివరాలను పోలీసులు సేకరించారు. గతేడాది జనవరిలో భారత్‌కు వచ్చిన ల్యాంబో లాక్‌డౌన్‌ విధించేంత వరకు ఉదయం పక్కా వృత్తి నిపుణుడిగా లెక్కా పత్రాలు చూసుకుని.. రాత్రైతే చాలు.. పబ్బుల్లో హాజరు వేసుకునేవాడు.

గుడ్‌గావ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఖరీదైన ఫ్లాట్‌లో ఉంటున్న ల్యాంబో తన నివాసానికి ఎవరినీ రానిచ్చేవాడు కాదు. దిల్లీలో నాలుగు కాల్‌ సెంటర్లు నిర్వహిస్తున్న ల్యాంబో.. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి నాగరాజును మాత్రమే నమ్మేవాడు. గుడ్‌గావ్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న చైనా దేశస్థురాలితో స్నేహంగా ఉండేవాడు. ఆమెతోపాటు మరో స్నేహితురాలితో తరచూ రెస్టారెంట్లకు వెళ్లేవాడు. లాక్‌డౌన్‌ సమయంలో లక్షల మందికి రుణాలివ్వడంతో స్నేహితురాళ్లతో గడపడం తగ్గించాడు. అన్‌లాక్‌ ప్రక్రియ మొదలయ్యాక మళ్లీ పబ్బులు రెస్టారెంట్లకు వెళ్లేవాడు.

ఇదీ చూడండి: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా... మరిన్ని కఠిన చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.