ఆవుపై చిరుత దాడి చేసిన ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలం జాంగావ్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. చిరుత సంచరిస్తుందని తెలిసి గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
జాంగావ్ గ్రామానికి చెందిన షేక్ హుస్మన్కు చెందిన ఆవు నిన్నటి నుంచి ఇంటికి రాలేదు. దీంతో ఊరంతా వెతికాడు. గ్రామానికి సమీపంలో ఆవు పడిపోయి కనిపించటంతో దగ్గరకు వెళ్లి చూడగా చనిపోయి ఉంది. ఆవు వెనుక భాగంలో, మెడపై చిరుత దాడి చేసిన ఆనవాళ్లు చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఆవు చుట్టు ఉన్న కాలి అడుగులు పరిశీలించి చిరుతనే దాడి చేసిందని నిర్ధారించారు. గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఇదీ చూడండి:రైతుబంధుతో రూ. 5,111 కోట్ల సాయం