యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరులో భూవివాదం చోటుచేసుకుంది. సర్వే నంబర్ 269 విస్తీర్ణం 1-19 గుంటల భూమి నాదంటే.. నాది అని ఇరుకుటుంబాల వారు అదే భూమిలో కొట్టుకున్నారు.
పురుషులు, మహిళలు.. కర్రలతో దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. దీనితో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ విషయంపై రెవెన్యూ సిబ్బందిని వివరణ కోరగా... జిల్లా స్థాయి అధికారుల పరిధిలో ఉందని తెలిపారు. ఈ మేరకు నివేదికను గతంలోనే తహసీల్దార్ కార్యాలయం నుంచి అందించామని పేర్కొన్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు