వారిద్దరు ఒకరునొకరు ఇష్టపడ్డారు. ప్రియురాలు పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే ప్రియుడు ముఖం చాటేశాడు. మోసపోయానని తెలుసుకున్న ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లెనిన్నగర్కు చెందిన ప్రవళిక అదే కాలనీలో ఉంటున్న చంటి ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లికి యువకుడు ఒప్పుకోవట్లేదని యువతి పోలీసులను ఆశ్రయించింది. చంటికి కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లికి ఒప్పించారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో ప్రవళిక ఉరివేసుకుని బలన్మరణానికి పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలు బంధువులు కోరుతున్నారు. ఇవీ చదవండి:నిర్లక్ష్యం ఖరీదు