తనపై అత్యాచారం జరిగిందంటూ హైదరాబాద్ పంజాగుట్టలో నమోదైన కేసు దర్యాప్తును పోలీసు అధికారులు సీఐడీకి అప్పగించారు. నల్గొండ జిల్లాకు చెందిన మహిళ తనపై తొమ్మిదేళ్లుగా 139 సార్లు అత్యాచారం చేశారని పంజాగుట్ట ఠాణాలో చేసిన ఫిర్యాదు కలకలం రేపింది. ఈ వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై పోలీసు ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడ్డారు.
కేసును సీఐడీకి అప్పగించగా... అధికారులు రంగంలోకి దిగి ముమ్మర దర్యాప్తు చేయనున్నారు. తొమ్మిదేళ్లుగా లైంగిక దాడి జరుగుతున్నప్పటికీ... బాధిత మహిళ ఎందుకు ఇన్నాళ్లు ఫిర్యాదు చేయలేదు...? అనే అంశంపై సీఐడీ లోతుగా ఆరా తీయనుంది. ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్న విషయాల్లో వాస్తవాలపై దృష్టి సారించనుంది.