హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన ఫౌజియాబేగం అలియాస్ శ్రీనిక (23), కర్బలా మైదాన్‌లోని ఓ సంస్థలో పనిచేస్తోంది. గత నెల 30న ఆఫీసుకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. ఆమె తిరిగి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు బంధువులు, మిత్రులకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఎంత వెతికినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఆమె భర్త వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ