ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపుడి వద్ద కారులో తరలిస్తున్న రూ.6 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను ఖమ్మం టాస్క్ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు.
గన్నవరం గ్రామానికి చెందిన మల్లిఖార్జున్ అనే వ్యక్తి కారులో నిషేధిత గుట్కాని తరలిస్తున్నట్టు సమాచారం అందిన ఏసీపీ, సీఐ ఆ వ్యక్తితో పాటు కారు, గుట్కా సంచులను వైరా పోలీస్స్టేషన్లో అప్పగించారు. నిందితుడిని టాస్క్ఫోర్సు పోలీసులు గడచిన రెండు నెలల్లో మూడుసార్లు పట్టుకోవడం గమనార్హం.
ఇదీ చదవండి: విరాళాల వెల్లువలు... ఆపదలో సినీ ప్రముఖుల ఆపన్నహస్తం