ETV Bharat / jagte-raho

వాహనాలను అపహరించే దొంగల ముఠా అరెస్ట్

author img

By

Published : Feb 9, 2021, 3:06 PM IST

వాహనాలను అపహరించి... వాటిని స్క్రాప్​కు విక్రయించే దొంగల ముఠాను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతి తక్కువ సమయంలోనే నిందితులను పట్టుకున్నామని సీపీ తెలిపారు. ఇద్దరు పరారీలో ఉన్నారని వెల్లడించారు.

karimnagar-police-arrested-thieves-who-theft-the-vehicle-lorry-and-auto-in-karimnagar-district
వాహనాలను అపహరించే దొంగల ముఠా అరెస్ట్

కరీంనగర్‌లో లారీలు, ఆటోలు దొంగిలించి స్క్రాప్‌కు విక్రయిస్తున్న ముగ్గురు దొంగలను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా అతితక్కువ సమయంలోనే దొంగల ముఠాని పట్టుకున్నట్లు సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. వాహనాలు దొంగిలించిన ముగ్గురు వ్యక్తులు కరీంనగర్ వాసులని... కొనుగోలు చేసిన వ్యక్తులు హైదరాబాద్‌కు చెందిన వారని ఆయన వెల్లడించారు.

ఖాన్‌పురకు చెందిన ఫహీం, రఫీక్‌ఖాన్‌, హుస్సేనిపురకు చెందిన సయ్యద్‌ యూసుఫ్‌లు దొంగతనంలో పాలుపంచుకున్నట్లు సీపీ చెప్పారు. దొంగిలించిన వాహనాలను స్క్రాప్‌గా మార్చి విక్రయించే లోపు నిందితులను అదుపులో తీసుకున్నామన్నారు. కొనుగోలు చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఖదీర్‌తో పాటు ఆసిఫ్‌, నవాబ్‌లు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. వారి వద్ద నుంచి లారీ, ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన సీపీ... అత్యంత వేగంగా దొంగలను పట్టుకున్న పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: ఉపాధి పేరిట మహిళల అక్రమ రవాణా... ముఠా అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.