ETV Bharat / jagte-raho

ఉద్యోగమిప్పిస్తామని.. ఊడ్చేశారు - కరీంనగర్​ జిల్లా వార్తలు

ఓ యువతి, ముగ్గురు యువకులు కలిసి నిరుద్యోగులను మోసం చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ముఠాను కరీంనగర్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన యువతి నిరుద్యోగ యువకులను మాయమాటలతో మోసం చేసి.. లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి భారీ స్థాయిలో నగదు, నకిలీ నియామక  పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సీపీ కమలాసన్​ రెడ్డి తెలిపారు.

karim Nagar Task Force Police Arrest A Cheating gang
ఉద్యోగమిప్పిస్తామని.. ఊడ్చేశారు
author img

By

Published : Sep 29, 2020, 11:54 PM IST

ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి.. నకిలీ నియామక పత్రాలు సృష్టించి నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను కరీంనగర్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్‌, వరంగల్ జిల్లా ఆసుపత్రుల్లో పనిచేస్తున్నానని నమ్మించి వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మొత్తం 31లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఠాలో ఓ యువతితో పాటు.. బెల్లంపల్లికి చెందిన కంబాల రాజేశ్‌, కుసుమ భాస్కర్, భీమ శంకర్‌లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.20వేల నగదు,మూడు సెల్‌ఫోన్లు, నకిలీ నియామక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ కమలాసన్‌ రెడ్డి తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తున్నట్టు సీపీ తెలిపారు.

ఉద్యోగమిప్పిస్తామని.. ఊడ్చేశారు

మాయమాటలే ఆయుధంగా..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన యువతి ఎంఎల్​టీ చదివి ఊద్యోగం లేక ఖాళీగా ఉంటోంది. కుటుంబ సభ్యులతో విడిపోయి కరీంనగర్​లోని ఆదర్శనగర్​లో ఒంటరిగా నివాసం ఉంటోంది. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అమాయక యువకులను లక్ష్యంగా చేసుకొని వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని ప్రేమ పేరుతో, ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెప్తూ వారి నుంచి లక్షలో డబ్బులు వసూలు చేస్తోంది. ఆమెతో పాటు.. మరో ముగ్గురు యువకుల సహాయం తీసుకొని మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. విచారణలో తాము చేసిన నేరాలను అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

లక్షల కొద్ది వసూలు చేశారు..

నిందితులు కరీంనగర్​లోని సిఖ్వాడి ప్రాంతానికి చెందిన యువకుని వద్ద వరంగల్​లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని.. క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్టు పేరుతో పదమూడున్నర లక్షల రూపాయలు వసూలు చేశారు. కరీంనగర్​లోని తిరుమల నగర్​లో నివాసం ఉంటున్న మరొక వ్యక్తి వద్ద ప్రభుత్వ ఉద్యోగం పేరుతో రూ.7 లక్షలు వసూలు చేశారు. గోదావరిఖనికి చెందిన మరో యువకుని వద్ద మూడు లక్షల రూపాయలు వసూలు చేశారు. వరంగల్​కు చెందిన యువకునితో నిఖితారెడ్డిగా పరిచయం చేసుకొని ఆ యువకుడితో సన్నిహితంగా మాట్లాడుతూ ఆతనితో ఛాటింగ్ చేసిన సంభాషణలు దాచి.. సదరు యువకుడిని బ్లాక్​మెయిల్​ చేస్తూ.. అతడి నుంచి రూ.6 లక్షలు వసూలు చేసింది.

పలు స్టేషన్లలో కేసులు నమోదు..

నిందితురాలు పలు ప్రాంతాల్లో ఉద్యోగాలు లేని యువకులను గుర్తించి.. వారికి తాను కరీంనగర్​ ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్​గా, వరంగల్‌ ఎంజీఎం హాస్పిటల్​లో కూడా విధులు నిర్వహిస్తున్నట్లు పరిచయం చేసుకునేది. తనకు అధికారుల వద్ద పలుకుబడి ఉన్నట్లు నమ్మించింది. యువకులను ప్రభుత్వాస్పత్రిలో క్లర్క్ ఉద్యోగం ఇప్పిస్తానని, క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్టు ఇప్పిస్తానని నమ్మించి.. రిజిస్ట్రేషన్​ కోసం డబ్బులు కావాలని లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. వీరిపై హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లి​లో, వరంగల్ మిల్స్ కాలనీ, గోదావరిఖని పోలీస్ స్టేషన్​లలో కూడా కేసులు నమోదు చేసినట్లు సీపీ కమలాసన్‌రెడ్డి వివరించారు.

ఇదీ చదవండి : ఇద్దరు వ్యక్తులు అరెస్టు... 24 కిలోల గంజాయి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.