హైదరాబాద్ చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదరాబాద్ రేస్ క్లబ్‌లో విషాదం చోటుచేసుకుంది. 4వ గుర్రపు రేస్ జరుగుతుండగా జితేందర్ సింగ్ అనే జాకీ రేస్‌లో గుర్రంపై నుంచి పడి మృతి చెందారు. రేస్ జరుగుతున్న సమయంలో అదుపుతప్పి పడిపోయిన జితేందర్ సింగ్ తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.
పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జితేందర్ సింగ్ మృతితో మిగతా గుర్రపు రేస్‌లు వాయిదా వేసినట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఆటవికం: అడవిలో తల్లి, కుమారుడి దారుణ హత్య