ETV Bharat / jagte-raho

ఉత్తుత్తి ఉద్యోగాల్లో చేరి మోసపోయారు

ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు. ఒప్పంద పద్ధతిలో జీతం వస్తదన్నాడు. ఒక్కొక్కరి వద్ద 20 నుంచి 50 వేలు వసూలు చేశాడు. తుదకు మోసపోయామని తెలుసుకున్న బాధితులు  కన్నీరుమున్నీరైన ఘటన నిజామాబాద్​లో చోటుచేసుకుంది.

నిజామాబాద్​ ప్రభుత్వ ఆస్పత్రి
author img

By

Published : Mar 19, 2019, 8:45 PM IST

Updated : Mar 19, 2019, 10:21 PM IST

ఉత్తుత్తి ఉద్యోగాల్లో చేరి మోసపోయారు
ఉద్యోగం పేరిట మోసాలు జరుగుతున్నా కొంత మంది మేలుకోవడం లేదు. తాజాగా నిజామాబాద్​ ప్రభుత్వ ఆస్పత్రిలో కొలువులు ఇప్పిస్తానని సతీశ్​ అనే వ్యక్తి పది మంది వద్ద... డబ్బు తీసుకున్నాడు. ఒక్కొక్కరి వద్ద 20 నుంచి 50 వేలు వసూలు చేశాడు. ఒప్పంద పద్ధతిలో మూడు నెలలకు ఒకసారి జీతం ఇస్తారని చెప్పి వారిని తీసుకెళ్లి దవాఖానాలో విధుల్లో చేర్పించాడు. నిజంగానే ఉద్యోగం వచ్చిందని నమ్మిన వారంతా ఆస్పత్రిలో పనులు చేసుకుంటున్నారు.

నిజం ఇలాబయటపడింది...
ఇంతలో ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు వార్డుల్లో పర్యవేక్షణకు వెళ్లారు. అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న పది మందిని చూసి ప్రశ్నించారు. తాము కొత్తగా ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదని స్పష్టం చేయడంతో వారంతా లదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇవీ చూడండి:విద్యార్థుల అస్వస్థత... సిబ్బందిపై వేటు

Intro:tg_nzb_04_19_vudhyogala_perutho_mosam_avb_c11
( ). నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఉద్యోగాల పేరిట మోసం..
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి లో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న పదిమంది బాధితులు..
ఆస్పత్రిలో సూపరింటెండెంట్ రాములు వార్డులో పర్యవేక్షణకు వెళ్లగా పలువురు అనధికారిక సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా అనుమానం వచ్చి వారిని విచారణ చేయగా సరైన సమాధానం చెప్పకపోవడంతో విధులు నిర్వహిస్తుంది తమ సిబ్బంది కాదని తెలుసుకున్నానన్నారు.
ఈ సందర్భంగా బాధితుల కథనం ప్రకారం సతీష్ అనే వ్యక్తి తమ దగ్గర నుండి 20 నుండి 50 వేల రూపాయలు వసూలు చేసి ఇక్కడ విధుల్లో పెట్టారని తెలిపారు. తమకు కాంటాక్ట్ స్టాఫ్ అని చెప్పి అదేవిధంగా జీతము మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తామని చెప్పారన్నారు.
తీరా తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేసిన సతీష్ అనే వ్యక్తి మొత్తం 24 మంది పనిచేస్తున్నట్లు రిజిస్టర్లో నమోదు చేశాడు.

Body:నిజామాబాద్ అర్బన్

Conclusion:నిజామాబాద్
Last Updated : Mar 19, 2019, 10:21 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.