జీడిమెట్ల ఠాణా పరిధి విమానపురి కాలనీలో సెప్టెంబరు 28న ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన విజయ్ బోస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనలో గాయపడిన సురేశ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
సెప్టెంబరు 28న విమానపురి కాలనీకి చెందిన ఓ యువతి తన సోదరుడితో కలిసి ద్విచక్రవాహనంపై వస్తుండగా.. ఇద్దరు యువకులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయమై యువతి సోదరుడు ఆ ప్రాంతానికి చెందిన సురేశ్‌కు చెప్పాడు.
దీని గురించి సురేశ్ గొడవ పడిన యువకుల ఇంటికి వెళ్లి వారిని నిలదీయడంతో.. సందీప్ తండ్రి విజయ్ బోస్.. సురేశ్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సురేశ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడు విజయ్ బోస్ పరారవ్వగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పట్టుకున్నారు.
ఇదీ చూడండి: హైదరాబాద్‌లో ఏపీ ఐఎఫ్‌ఎస్ అధికారి అత్మహత్య