అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 22 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 62,500 రూపాయల నగదు, 21 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మహబూబ్ బాషా కేసు వివరాలను వెల్లడించారు.
ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్నందున క్రికెట్ బెట్టింగ్‌లు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచామని ఆయన వెల్లడించారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 22 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. డబ్బుల కోసం యువత అడ్డదారి తొక్కవద్దని... జిల్లాలో బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.