వనపర్తి జిల్లా కేంద్రంలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ ఫోన్ ద్వారా ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వనపర్తిలోని బ్రహ్మంగారి వీధికి చెందిన గడ్డమీది విజయ్ రాంనగర్లో ఏర్పుల లాలూ యాదవ్ ఇల్లు అద్దెకు తీసుకుని ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణ ఎస్ఐ వెంకటేష్ గౌడ్ సిబ్బందితో దాడి చేసి క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.
ఈదాడిలో రూ.9,700 నగదు, 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గడ్డమీడి విజయ్, నరేశ్, గోకం వినోద్, ఖాజా, వెంకటేశ్, గోవర్ధన్, అనిల్ కుమార్‌ను అరెస్ట్ చేసిన్నట్లు పోలీసులు తెలిపారు. ఇల్లు అద్దెకు ఇచ్చిన యజమాని ఏర్పుల లాలూ యాదవ్‌ను కేసులో నిందితునిగా చేర్చిన్నట్లు స్పష్టం చేశారు. ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు వారి పూర్తి వివరాలు తెలుసుకుని అద్దెకివ్వాలని సూచించారు.
ఇదీ చూడండి: ప్రమాదాల్లో పాదచారులే అధికం.. వంతెనల నిర్మాణాజాప్యమే కారణం