ఆదిలాబాద్‌లో 20 రోజుల క్రితం సినీ ఫక్కీలో దొంగతనానికి పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా పట్టుబడింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన అరీఫ్ మరో నలుగురితో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. వీరు అక్టోబర్ 8న ఆదిలాబాద్ బి. రాములు కాంప్లెక్స్‌లోని ఓ దుకాణంలో రూ. 8 లక్షల విలువ చేసే పాన్‌మసాలా, సిగరెట్లను దొంగలించారు.
ఈ కేసును సవాల్‌గా తీసుకున్న ఆదిలాబాద్ పోలీసులు శనివారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పాన్‌మసాల, సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడితో పాటు మరొకరి కోసం గాలిస్తున్నట్టు ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: భూ వివాదం పరిష్కారానికి లంచం డిమాండ్.. అనిశాకు చిక్కిన సీఐ