హైదరాబాద్‌లో మహిళలను బెదిరించి చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రెండు ల్యాప్‌ట్యాప్‌లు, 26 తులాల బంగారు, 5 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
మోసమే ప్రధాన వృత్తి
ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన సోమయ్య మోసం చేయడమే తన వృత్తిగా ఎంచుకున్నాడు. ఖరీదైన హోటళ్లలో ఉంటూ, మహిళలతో సాన్నిహిత్యం పెంచుకుంటాడు. ఆ తరువాత వారిపై బెదిరింపులకు దిగి విలువైన బంగారు ఆభరణాలు, వస్తువులను దోచుకెళ్తాడు. చోరీ చేసిన సొమ్మును సొంత ఊరిలో విక్రయించి, జల్సాలు చేసేవాడు. ఇతనిపై తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, గోవాలో కలిపి 80 కేసులున్నాయి.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 12 చోరీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.