దోపిడీలకు పాల్పడే అంతర్రాష్ట్ర ముఠాను ఆంధ్రప్రదేశ్‌లోని కడప పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఒక పిస్తోలు, 4 తూటాలు, 3 ద్విచక్ర వాహనాలు, 15 చరవాణులు, 10 వేల రూపాయల నగదు 4 చక్రాల వాహనం ఒకటి స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన 21 మంది గ్యాంగ్‌లో ఆరుగురు డిగ్రీ చదివిన విద్యార్థులు ఉండటం విశేషం. అదుపులోకి తీసుకున్న వారిని కడప జిల్లా పోలీస్ అధికారి అన్బురాజన్ జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా ఎదుట హాజరుపరిచారు.
అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన రాజేష్, యాసీన్, వంశీ, కిరణ్ గతంలో బళ్లారి, కర్ణాటక ప్రాంతాలలో దోపిడీలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో డిగ్రీ చదివిన విద్యార్థులను ఇంటి వద్ద ఖాళీగా ఉన్న వారిని ఎంపిక చేసుకొని వారికి డబ్బు ఆశ చూపించి వారి వెంట తీసుకెళ్లేవారు. ఇలా 21 మంది గ్యాంగ్‌గా ఏర్పడి దోపిడీలకు పాల్పడేవారు. ఈ క్రమంలో రాజంపేట వద్ద ఇంట్లో దోపిడీ చేసేందుకు రెక్కీ నిర్వహించారు.
ఓ వ్యక్తిని పోలీసులు అనుమానాస్పద స్థితిలో పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా గ్యాంగ్ విషయం బయటపడింది. పోలీసులు ఎంతో శ్రమించి 21 మందితో ఉన్న గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. వీరు ఏకాంతంగా ఉన్న నివాసాన్ని ఎంచుకుని ఆ ఇంట్లో దోపిడీకి పాల్పడే వారని ఎస్పీ పేర్కొన్నారు. వీరిలో చదువుకున్నవారు సైతం ఉండటం బాధాకరమన్నారు. ఈ గ్యాంగ్‌పై పలు జిల్లాల్లో కేసులున్నాయని ఎస్పీ చెప్పారు. ఈ గ్యాంగ్‌ను పట్టుకున్న పోలీస్ అధికారులను, సిబ్బందిని, ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.
ఇదీ చదవండి : ఆ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు.. 16 మంది మృతి!