కర్ణాటక మాతాజీ స్వామిజీ కిడ్నాప్ కేసులోని కీలక విషయాలను లంగర్‌హౌస్ సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. స్వామిజీ శిష్యులు పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి కేసు అవసరం లేదని స్వామిజీ తమను కోరారని పేర్కొన్నారు. దర్యాప్తులోనూ కిడ్నాప్ చేసినట్లు తెలియలేదని స్పష్టం చేశారు.
ఈనెల 18న రేవంత్ రావు మారెప్ప అనే స్వామిజీని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని... ప్రస్తుతం ఆయన నాలానగర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. వెంటనే అప్రమత్తమై ఆ ఆస్పత్రికి వెళ్లి దర్యాప్తు చేశామన్నారు. కర్ణాటకకు చెందిన ఆలయ పూజారి రేవంత్ రావు మారెప్ప అనే స్వామీజీని తన ఇద్దరు శిష్యులు షిరిడీ వెళ్లడం కోసమని హైదరాబాద్ విమానాశ్రయానికి తీసుకొచ్చారని చెప్పారు. వారికి టికెట్లు లభించకపోవడంతో బెంగళూరుకి వెళ్లారన్నారు.
"బెంగుళూరులో స్వామిజీకి, అతని ఇద్దరు శిష్యులకు వ్యక్తిగత విషయాల్లో వివాదం తలెత్తింది. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని స్వామీజీ వారి శిష్యులను సముదాయించారు. ఆ తర్వాత గుండె నొప్పి అని... తను రెగ్యులర్‌గా హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటానని వారిని కోరారు. వారు చికిత్స కోసం హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. స్వామిజీ తన శిష్యుడైన సందీప్‌కి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పారు. స్వామిజీని కిడ్నాప్ చేశారని సందీప్ పోలీసులకు సమాచారం అందించారు. మాతాజీని ఫిర్యాదు చేయమని అడిగినా పిటిషన్ ఇవ్వలేదు. స్వామిజీ శిష్యులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు."
-శ్రీనివాస్, లంగర్‌హౌస్ సీఐ
ఇదీ చదవండి: సినీ ఫక్కిలో కర్ణాటకకు చెందిన స్వామిజీ కిడ్నాప్..