అభం శుభం తెలియని ఓ బాలికకు మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన సహృదయ అనే యువకుడు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతని ఇంటి సమీపంలో ఉండే ఓ ఐదేళ్ల బాలిక తన తల్లితో కలసి తరచూ పక్కింటికి వస్తుండేది.
ఈ క్రమంలో గత శనివారం ఇంటికి వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి లోపలికి తీసుకెళ్లాడు. ఆపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లిన అనంతరం బాలిక రక్తస్రావంతో బాధపడుతుండటం చూసిన తల్లి ఆరాతీయగా అసలు విషయం బయటపడింది. బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
జరిగిన ఘటన బయటకు పొక్కకుండా సదరు యువకుడి కుటుంబ సభ్యులు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. చివరకు బుధవారం రాత్రి స్థానిక నేతలతో కలసి బాధిత కుటుంబ సభ్యులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ ఎన్. శ్రీనివాస్ తెలిపారు.
ఇదీ చదవండి: కన్నతండ్రి కాదు కామాంధుడు.. కుమార్తెపై అత్యాచారం..