ఇంటర్ రివాల్యూయేషన్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదని ఓ విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి యత్నించింది. మేడ్చల్ జిల్లా కప్రా మండలం దమ్మాయిగూడాలో ఉండే మేకల మానస నిన్న విడుదల చేసిన ఇంటర్ పునఃమూల్యంకన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదు. తీవ్ర మనస్థాపానికి గురైన మానస ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఇది గమనించిన స్థానికులు మానసను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఫెయిల్ అయినందున తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిందని స్థానికులు అంటున్నారు.
ఇవీ చూడండి: ఎమ్మెల్సీగా నవీన్ రావు ఎన్నిక లాంఛనం!