హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 19 మందికి న్యాయస్థానాలు జైలు శిక్షలు విధించాయి. మొత్తం 207 కేసులు విచారించిన కోర్టులు నిందితులకు రూ.8.94లక్షల జరిమానా విధించాయి.
మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్ పల్లి, అల్వాల్, జీడిమెట్ల, మియాపూర్, రాజేంద్రనగర్, షాద్నగర్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారి లైసెన్సులు రద్దు చేసేందుకు ఆర్టీఓ అధికారులు లేఖ రాశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల్లో ఇతర వాహనదారుల మృతికి కారణమైన వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.