నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా బొలెరో వాహనంలో 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కల్వకుర్తి వైపు తరలిస్తున్నారు. ఈ విషయంపై సమాచారం రావడం వల్ల పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు.
బియ్యంతో పాటు వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాధవ రెడ్డి వెల్లడించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: అక్రమంగా రవాణా చేస్తున్న 105 క్వింటాళ్ల రేషన్‌బియ్యం స్వాధీనం