ETV Bharat / jagte-raho

150 క్వింటాళ్ల అక్రమ రేషన్​ బియ్యం పట్టివేత

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో అక్రమంగా నిల్వ చేసిన 150 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని రెవెన్యూ, పౌర సరఫరా శాఖ అధికారులు పట్టుకున్నారు. చౌక దుకాణాలు, రేషన్​ లబ్ధిదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని గోదాముల్లో నిల్వ చేసి.. అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నసమయంలో అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

Illegal Ration Rice Caught by revenue officers In Sangareddy District Zaheerabad
150 క్వింటాళ్ల అక్రమ రేషన్​ బియ్యం పట్టివేత
author img

By

Published : Oct 5, 2020, 2:42 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ పట్టణంలోని ఆటో నగర్​లో ఓ రేకుల షెడ్డులో అక్రమంగా నిల్వ చేసిన 150 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ రూ.3 లక్షల వరకు ఉంటుందని వారు తెలిపారు.

చౌక ధరల దుకాణాలు, లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యం కొని.. బ్లాక్​మార్కెట్​లో ఎక్కువ ధరకు అమ్ముతారని.. బియ్యం నిల్వ చేసిన వ్యక్తుల మీద కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్​ బసవయ్య తెలిపారు. పట్టుబడిన బియ్యాన్ని జహీరాబాద్​లోని పౌర సరఫరా గోదాంకు తరలించారు.

ఇదీ చూడండి: కొవిడ్‌ నుంచి కోలుకున్నా.. వేధిస్తున్న సాధారణ సమస్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.