ETV Bharat / jagte-raho

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్.. పరారీలో మరో వ్యక్తి - two arrested in illegal ganja trading in siddipe

గంజాయి వ్యాపారం చేస్తున్న ఇద్దరు నిందితులను సిద్దిపేట జిల్లా జగదేవపూర్​ పోలీసులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించామని.. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

two arrested in illegal ganja trading in siddipe
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్.. పరారీలో మరో వ్యక్తి
author img

By

Published : Sep 8, 2020, 5:07 PM IST

సిద్దిపేట జిల్లా జగదేవపూర్​కు చెందిన స్వామి, చంద్రశేఖర్, మహిపాల్.. ముగ్గురూ జల్సాలకు అలవాటుపడి.. సంపాదన సరిపోక.. గంజాయి వ్యాపారం మొదలుపెట్టారు. జగదేవపూర్​ గ్రామశివారులో ఉన్న వైన్​షాప్​ వద్ద గంజాయి ప్యాకెట్లను తీసుకొచ్చి అమ్మతున్నారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం రాగా.. ఎస్సై పరమేశ్వర్​గౌడ్, సిబ్బందితో కలిసి సోదాలు చేశారు.

ప్లాస్టిక్​ డబ్బాలో దాచి ఉంచిన 58 గంజాయి ప్యాకెట్లు, చంద్రశేఖర్​ వద్ద 2 ప్యాకెట్లు.. మొత్తం 60 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉండగా అతని కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి: పీవీకి భారతరత్న తీర్మానం సమయంలో సభలో స్వల్ప సంవాదం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.