ఘరానా దొంగ మంత్రి శంకర్ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. శంకర్ సహా ముఠాలోని నలుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
శంకర్‌పై గతంలో 250 దొంగతనం కేసులుండగా... 4 సార్లు పీడీ యాక్టు కింద జైలుకు వెళ్లివచ్చినట్లు సీపీ చెప్పారు. 60 ఏళ్ల వయసులోనూ దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడించారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ముఠాపై అనేక కేసులున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి నగదు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.
- ఇదీ చూడండి : యూకేలో తెలంగాణ బిడ్డ అనుమానాస్పద మృతి