ETV Bharat / jagte-raho

ఆటోలో రహస్య అర.. తెరిచిచూస్తే గంజాయి.. - Cannabis caught in Hyderabad

నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని హైదరాబాద్​ జుమారత్​ బజార్​ వద్ద పోలీసులు పట్టుకున్నారు. 20 కిలోలకు పైగా గంజాయిని ఎన్​ఫోర్స్​మెంట్​ విభాగం స్వాధీనం చేసుకుంది.

Hyderabad police caught Cannabis
జుమారత్​ బజార్​ వద్ద గంజాయి పట్టివేత
author img

By

Published : Sep 25, 2020, 9:05 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి హైదరాబాద్​ ధూల్​పేట్​కు తరలిస్తున్న నిషేధిత గుట్కాను​ జుమారత్​ బజార్​ వద్ద పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 20 కిలోలకు పైగా గంజాయిని ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జుమారత్​ బజార్​ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు.. అనుమానం వచ్చి ఓ ఆటోరిక్షాను అడ్డుకున్నారు.

ఆటో వెనకభాగాన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంపార్ట్​మెంట్​లో దాచిన 20 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ ఘటనలో షేక్ సమాద్ యాకుబ్ పాషా, తేజోవత్ సురేశ్, మహమూద్ అబ్ధుల్ ఆజాద్​లను అరెస్టు చేసినట్లు ఎన్​ఫోర్స్​మెంట్ ఏఈఎస్​ అంజిరెడ్డి తెలిపారు. ఆటోతో పాటు నాలుగు మొబైల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

నిందితులను విచారించగా.. తూర్పుగోదావరి జిల్లా రాయవరానికి చెందిన బాల్​రెడ్డి, తాతారెడ్డిలు .. కిలో రెండు వేల రూపాయలకు కొనుగోలు చేసి 38 కిలోల గంజాయిని భద్రాచలానికి తరలించారని వివరించారు. భద్రాచలంలో వారి నుంచి కిలో నాలుగు వేల రూపాయలకు కొనుగోలు చేసిన గంజాయిని హైదరాబాద్​ ధూల్​పేటకు తరలిస్తున్నట్లు విచారణలో నిందితులు తెలిపారని.. పేర్కొన్నారు. ఈ గ్యాంగ్​లో 8 మంది నిందితులున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఐదుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.