చిన్నారుల అక్రమ రవాణా అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా వారిలో మార్పు రావడం లేదు. తాజాగా రాచకొండ పోలీసులు 20మంది చిన్నారులను రక్షించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి హైదరాబాద్ నగరానికి 20 మంది బాలకార్మికులను తరలిస్తున్నారనే సమాచారంతో.. రాష్ట్ర బచ్‌పన్ బచావో ఆర్గనైజేషన్‌తో కలిసి పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. వీరందరిని ఎల్‌బీనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా సీడ్ల్యూసీ అధికారులు బాల కార్మికుల వివరాలు సేకరించారు.
వయస్సు నిర్ధరణ తర్వాత..
బాలల వయస్సు నిర్ధరణ అయిన తర్వాత.. ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తామని చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి దేవేంద్ర చారి తెలిపారు. వీరిని హైదరాబాద్ నగరంలోని భవన నిర్మాణానికి, టింబర్ డిపోల్లో పెట్టడానికి తీసుకొచ్చారని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: విద్వేషపూరిత సందేశాలను అరికట్టేందుకు వాట్సప్ నంబర్!