దోపిడీ, దొంగతనాలకు పాల్పడుతున్న నేరగాడిపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పీడీ చట్టం నమోదు చేశారు. అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురానాహవేలి ప్రాంతంలో నివసించే సయ్యద్ ఫయాజ్ ఇమ్రాన్ దోపిడీ, దొంగతనాలు చేసేవాడు. పలుమార్లు అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ అతనిలో మార్పు రాకపోవడం వల్ల పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఫయాజ్‌పై పీడీ చట్టం నమోదు చేశారు.
దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. తీరు మార్చుకోని నేరగాళ్లపై పీడీ చట్టం నమోదు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'మూడో వ్యక్తి జోక్యం చేసుకుంటే పీడీ యాక్ట్ నమోదు'