ETV Bharat / jagte-raho

'సొంత అవసరాలకు బ్యాంకు డబ్బు వాడుకున్న నిందితులు'

సొంత అవసరాలకు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఏటీఎం కేంద్రాల నుంచి రూ. 4 కోట్లు తీసుకొని వాడుకున్న నిందితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

'సొంత అవసరాలకు బ్యాంకు డబ్బు వాడుకున్న నిందితులు'
'సొంత అవసరాలకు బ్యాంకు డబ్బు వాడుకున్న నిందితులు'
author img

By

Published : Oct 7, 2020, 7:05 PM IST

బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాష్ కస్టోడియన్​లుగా ఉంటూ ఆ బ్యాంక్ ఏటీఎం కేంద్రాల నుంచి రూ. 4 కోట్లు తీసుకొని సొంత అవసరాలకు వాడుకున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ డిటెక్టివ్ డిపార్ట్​మెంట్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.

వనస్థలిపురానికి చెందిన సంజయ్ సింగ్ ఠాకూర్, అల్వాల్ కు చెందిన వెంకటేశ్ ల నుంచి రూ. 10 లక్షల నగదుతో పాటు ఇతర విలువైన డాక్యుమెంట్లను వారి నివాసాల నుంచి స్వాధీనం చేసుకున్నారు.

తమ పేరు మీద నకిలీ డిపాజిట్ స్లిప్పులు, రిజిస్టర్లు సృష్టించి మోసగించారని లాగ్ క్యాష్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు సురేశ్ జంగం, హిటాచి పేమెంట్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి రమేశ్ గండ్ల కూడా ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేశారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హజరుపరిచి జైలుకు తరలించారు.

ఇదీ చూడండి: ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ, భద్రతకు సర్కారు ప్రాధాన్యం ఇస్తోంది: కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.